హైదరాబాద్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 18 పురాతన డ్యామ్‌లు ఉన్నాయని కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. గురువారం పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నిర్వహించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ లార్జ్ డ్యామ్ (2019) నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 100 సంవత్సరాల క్రితం (1921కు ముందు) నిర్మించినవి 227 ఉన్నాయని తెలిపారు. అందులో మధ్యప్రదేశ్‌లో 62, మహారాష్ట్రలో 42, గుజరాత్లో 30, రాజస్థాన్‌లో 25 ఉండగా.. తెలంగాణలో 18 ఉన్నాయని వివరించారు. 50 ఏండ్ల క్రితం (1971లో) నిర్మించిన డ్యామ్‌లు రాష్ట్రంలో 58 ఉన్నట్టు వెల్లడించారు.