జొన్నకర్ర సాధారణంగా అయిదు నుంచి ఆరు అడుగులు పెరుగుతుంది. కానీ, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రామచంద్రాపురానికి చెందిన బొలిశెట్టి సైదులు ఇంట్లో మొలిచిన జొన్న కర్ర 17 అడుగుల ఎత్తు పెరిగింది. పోషకాలు, జన్యుపరమైన మార్పులతో కొన్ని మొక్కలు ఇలా ఏపుగా పెరుగుతాయని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త దొంగరి నరేశ్ తెలిపారు.
-గరిడేపల్లి