తిరుపతి : గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవని, గోసంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టీటీడీ( TTD ) అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ( CH . Venkaiah Chowdary ) కోరారు. టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ , శ్రీనివాస సేవా ట్రస్ట్ ఛైర్మన్ టి. సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ గోశాలకు ఆదివారం 180 లారీల ద్వారా సుమారు 1600 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా ( Dry Fodder Donate ) అందజేశారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతం నుంచి ఎండుగడ్డిని సేకరించి, స్వంత నిధులతో పాటు రవాణా ఖర్చులను భరిస్తూ భారీ స్థాయిలో మొదటిసారిగా విరాళం అందించడం అభినందనీయమన్నారు. గోవుల పరిరక్షణ, పాడి ఉత్పత్తుల పెంపు కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఆదర్శమన్నారు.
తిరుపతి ఎస్వీ గోశాలకు అందిన ఎండుగడ్డిని టీటీడీ పరిధిలోని తిరుపతి, తిరుమల, పలమనేరు, బాకారాపేట సమీపంలోని కమలయ్యగారిపల్లి గోశాలలకు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ గోశాలల్లో మొత్తం 2974 గోవులు, ఎద్దులు, లేగదూడలు ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, జానకీదేవి, జి. భానుప్రకాశ్ రెడ్డి, ఎన్. సదాశివరావు, శాంతారామ్, దర్శన్, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, ఏవీఎస్వో రమేష్, వైద్యులు , తదితరులు పాల్గొన్నారు. Dry Fodder Donated ,