అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల పునర్విభజన కసరత్తు దాదాపుగా పూర్తయిందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. కొత్త జిల్లాల నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి తుది నోటిఫికేషన్ వస్తుందని ఆయన వెల్లడించారు. ముందుగా అనుకున్న విధంగా 11 రెవెన్యూ డివిజన్లు కాకుండా అదనంగా మరో 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నామని ఆయన వివరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికుల నుంచి ఇప్పటి వరకూ 9 వేలకు పైగా విజ్ఞప్తులు రాగా వాటిపై తుది కసరత్తు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొందరు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు పేరు మార్చాలని అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిని పరిష్కరించేందుకు అవకాశాలను అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.