బజార్ హత్నూర్ : మండలంలోని బుర్కపల్లి గ్రామంలో జొన్న పంట ( Sorghum Crop) ల్యాప తిని 16 ఆవులు ( Cows ) మృతి చెందగా, 45 ఆవులకు పెను ప్రమాదం తప్పింది. రైతులు, పశు వైద్యధికారి పర్వేజ్ హైమద్ ( Parvez Haimad ) తెలిపిన వివరాల ప్రకారం..
బుర్కపల్లి గ్రామంలోని 13 మంది రైతులకు చెందిన 51 ఆవులు గ్రామ సమీపంలో ని పంట పొలాల్లో ఉన్న జొన్న పంట ల్యాప ను తిన్నాయి. దీంతో 16 ఆవులు అక్కడికక్కడే చనిపోగా, మరో 45 ఆవుల పరిస్థితి విషమంగా ఉండడంతో గమనించిన రైతులు, గ్రామస్థులు పశు వైద్యాధికారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారి సంఘటన స్థలానికి చేరుకొని 45 ఆవులకు చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ సందర్బంగా పశువైద్యాధికారి మాట్లాడుతూ రైతులు జొన్న పంట కోసిన వెంటనే పంటను కాల్చివేయాలని, అలాగే ఉంచితే వర్షాలు పడి చిగురించిన ల్యాపను పశువులు తింటే పెను ప్రమాదమని వెల్లడించారు. చనిపోయిన ఆవుల విలువ సుమారు. 4 లక్షలకు పైగా ఉంటుందని ఆయన తెలిపారు.