హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి తొలి విడతగా రూ.259. 36 కోట్లు విడుదలయ్యాయి.
ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో తాజాగా కొన్ని నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇంకా సుమారు రూ.3వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. నిధుల విడుదలపై ఆ శాఖ మంత్రి సీతక హర్షం వ్యక్తంచేశారు.