ఢిల్లీ : క్రొయేషియాలో జరుగుతున్న జాగ్రెబ్ ర్యాంకింగ్ సిరీస్లో భారత రెజ్లర్లు తొలిరోజే మూడు పతకాలు సాధించారు.
మెన్స్ ఫ్రీస్టయిల్ 65 కిలో ల విభాగంలో సుజిత్ కల్కల్ స్వర్ణంతో సత్తాచాటగా పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (61 కిలో లు) రజతం గెలిచాడు. 70 కేజీల క్యాటగిరీలో అభిమన్యు కాంస్యం నెగ్గాడు.