Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Suspension | కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది సీనియర్లపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది.
Suspension | కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది సీనియర్లపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఆరోపణల తీవ్రత ఆధారంగా నలుగురు విద్యార్థులను ఆరు నెలలు, మరో పది మందిని నాలుగు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఒకేసారి 14 మందిపై చర్యలు తీసుకోవడం వైద్య కళాశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్ఎంసీకి ఫిర్యాదుతో వెలుగులోకి..
కళాశాలలో కొందరు సీనియర్లు తమను వేధిస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు వారం రోజుల క్రితం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్ఎంసీ అధికారులు స్థానిక పోలీసులతోపాటు కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. దీంతో కళాశాల యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది. విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ కావడంతోపాటు, ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై మంగళవారం కళాశాల ఉన్నతాధికారులు, ప్రిన్సిపాల్ వాల్యా, వివిధ విభాగాల అధిపతులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విచారణలో వెలుగుచూసిన అంశాలను పరిశీలించి 14 మంది విద్యార్థులపై సస్పెన్షన్ విధించాలని నిర్ణయించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురికి ఆరు నెలలు, మరో పది మందికి నాలుగు నెలల సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయిన వారిలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.
జూనియర్ల ఫిర్యాదుతోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ వాల్యా తెలిపారు. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారమే చర్యలు తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వివరించారు. కళాశాల ప్రాంగణంలోనైనా, హాస్టల్లోనైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

