లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
పటాకులు విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందాలని జైనూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోదారి రవికుమార్ సూచించారు.
జైనూర్ ,నవంబర్ , 4 : పటాకులు విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందాలని జైనూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోదారి రవికుమార్ సూచించారు. లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పటాకులు నిల్వలు, విక్రయాల విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన Explosives Act, Explosives Rules–2008 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ప్రభుత్వం నిషేధించిన క్రాకర్స్, అనుమతులు లేని పటాకులు, నాణ్యతా ప్రమాణాలు లేని వస్తువులను విక్రయించరాదన్నారు. దుకాణాల వద్ద అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని, ధూమపానం, బహిరంగ మంటలకు అనుమతించరాదని సూచించారు. అనుమతి పొందిన ప్రదేశాల్లోనే దుకాణాలు నిర్వహించాలని, నిర్ణీత పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయవద్దని స్పష్టం చేశారు.
అలాగే సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించారు. కుల, మత, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా రెచ్చగొట్టే పోస్టులు, సందేశాలు, వీడియోలను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ గోదారి రవికుమార్ తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
NZvIND: తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 ఆలౌట్….
Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

