Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
Prajwal | సినిమా వేడుకల్లో సాధారణంగా స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అయితే ఈ మధ్య ఓ చిన్నోడు మాత్రం తన మాటతీరుతో సినీ ప్రముఖులనే మించిపోయేలా సందడి చేస్తున్నాడు. అతడే ప్రజ్వల్. ఇటీవల ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ సినిమా కార్యక్రమంలో తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బుడ్డోడు.. తాజాగా ‘సమ్మర్ హాలిడేస్’ వేడుకలోనూ మరోసారి హైలైట్ అయ్యాడు.
Prajwal | సినిమా వేడుకల్లో సాధారణంగా స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అయితే ఈ మధ్య ఓ చిన్నోడు మాత్రం తన మాటతీరుతో సినీ ప్రముఖులనే మించిపోయేలా సందడి చేస్తున్నాడు. అతడే ప్రజ్వల్. ఇటీవల ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ సినిమా కార్యక్రమంలో తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బుడ్డోడు.. తాజాగా ‘సమ్మర్ హాలిడేస్’ వేడుకలోనూ మరోసారి హైలైట్ అయ్యాడు. ఈసారి మైక్ పట్టుకుని ప్రసంగించడమే కాదు.. నేరుగా సినీ ప్రముఖుల దగ్గరకు వెళ్లి ప్రశ్నలు అడుగుతూ వారితో సరదాగా మాట్లాడాడు. ‘సమ్మర్ హాలిడేస్’ కార్యక్రమంలో స్టేజ్ కింద కూర్చున్న హీరో కిరణ్ అబ్బవరం, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బాబీ దగ్గరకు వెళ్లిన ప్రజ్వల్.. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మామిడిపండ్లు దొంగిలించారా? అంటూ ప్రశ్నించాడు. దీనికి కిరణ్ అబ్బవరం తాను కూడా చిన్నప్పుడు అలాంటి పనులు చేశానని సరదాగా సమాధానమిచ్చారు.
అల్లు అరవింద్ కూడా తన చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఓ ఇంట్లో మామిడి చెట్టు కనిపించడంతో లోపలికి వెళ్లి పండ్లు కోసుకుని పరుగెత్తినట్లు గుర్తుచేసుకున్నారు. ఇక దర్శకుడు బాబీ ఇచ్చిన సమాధానం మరింత నవ్వులు పూయించింది. దొంగతనం చేయనివాడు ఇండస్ట్రీకి రాడని, సృజనాత్మకత ఉన్న ప్రతి ఒక్కరూ దొంగలేనని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రజ్వల్ చిన్నప్పుడు చేసిన చిలిపి పనుల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. షూటింగ్ సమయంలో సహనటికి లైన్ వేశావా? అని అడగ్గా.. తాను అందరినీ అక్క అని పిలుస్తానంటూ అమాయకంగా సమాధానమిచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. పెద్దవాళ్లు తనను ఆటపట్టించినా ఏమాత్రం తడబడకుండా వెంటనే సమాధానం చెప్పడం ప్రజ్వల్ ప్రత్యేకతగా నిలిచింది.
ప్రజ్వల్ మాట్లాడే విధానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలు అడగడం ఒక ఎత్తయితే.. ఎదుటివారు ఇచ్చే సమాధానాలకు అనుగుణంగా వెంటనే స్పందించడం మరో ఎత్తు. అల్లు అరవింద్, బాబీ వంటి సీనియర్ సినీ ప్రముఖులతోనూ ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడటం అతడిలోని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. ఇటీవల ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ కార్యక్రమంలో ప్రజ్వల్ ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ ప్రసంగాన్ని ఈ కార్యక్రమంలోనూ సినీ ప్రముఖులు ప్రస్తావిస్తూ అతడితో సరదాగా మాట్లాడారు. మరోసారి తన ప్రసంగం వినిపించాలంటూ అడగడం కూడా కనిపించింది.ప్రజ్వల్‌కు వస్తున్న గుర్తింపు కేవలం సినిమాల్లో నటించడం వల్లే కాదు. సినిమా వేడుకల్లో తన మాటతీరు, చురుకైన ప్రశ్నలు, సమయస్ఫూర్తితో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గత ఈవెంట్లో మైక్ పట్టుకుని ప్రసంగించిన ఈ చిన్నోడు.. ఇప్పుడు నేరుగా సినీ ప్రముఖుల దగ్గరకు వెళ్లి వారినే ప్రశ్నలతో ఇరుకున పెట్టాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
NZvIND: తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 ఆలౌట్
Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

