కుషినగర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లి వేడుక విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ బావిలో పడి 13 మంది మరణించారు. కుషీనగర్లోని నెబువా నౌరంగియా గ్రామంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెండ్లికి ముందు నిర్వహించే హల్దీ వేడక సందర్భంగా ఓ పాడుపడిన బావి సమీపంలో సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీన్ని చూడటానికి కొంత మంది బావిపై ఉన్న గ్రిల్ (స్లాబ్లాంటిది) మీద కూర్చొన్నారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ గ్రిల్ కూలిపోవడంతో 23 మంది బావిలో పడిపోయారు. దీంతో వెంటనే వారందరినీ దవాఖానకు తరలించగా.. పరిశీలించిన వైద్యులు 13 మంది మరణించినట్టు ధ్రువీకరించారు. వీరిలో రెండేండ్ల పాప ఉన్నది. అంతేగాక మృతులంతా మహిళలే. గాయపడిన 10 మంది చికిత్స పొందుతున్నారు.