భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు మరణించారు. ధార్ వద్ద ఈ ఘటన జరిగింది. దుర్ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 15 మందిని రక్షించినట్లు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇండోర్ నుంచి పూణె వెళ్తున్న బస్సు.. ధార్ జిల్లాలోని ఖల్ఘాట్ సంజత్ సేతు వద్ద ఉన్న లోయలో పడింది.