12th Fail | బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikranth Massey) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మీర్జాపూర్ (Mirzapur) వెబ్ సిరీస్‌తో ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. ఈ ఏడాది ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘గ్యాస్‌లైట్’ ‘ముంబైకర్ సినిమాలలో కనిపించి అలరించాడు. ఇక విక్రాంత్ మాస్సే తాజాగా నటించిన చిత్రం 12 ఫెయిల్(12th Fail). పీకే, త్రీ ఇడియట్స్ సినిమాల నిర్మాత విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ నెల 27న రిలీజైన ఈ సినిమా హిందీలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎగబడిపోతున్నారు. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశామని రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇక ఈ మూవీకి వస్తున్నా పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఇదే సినిమాను 12th ఫెయిల్ (12th Fail) అనే పేరుతో తెలుగులో నవంబర్ 3న విడుదల చేయనునున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రముఖ రచయిత అనురాగ్ పాఠక్ యొక్క బెస్ట్ సెల్లింగ్ నవల 12 ఫెయిల్ ఆధారంగా ఈ సినిమా రానుంది.
Super hit hindi film #12thFail now releasing in cinemas on 3rd November in TELUGU – inspired by a million true stories.@VVCFilms @ZeeStudios_ @VikrantMassey @MedhaShankr @anantvijayjoshi @Anshumaanpushk1 #VikasDivyakirti #GeetaAgrawalSharma @theHarishKhanna @priyanshuchats… pic.twitter.com/5pagMv1z07
— Vamsi Kaka (@vamsikaka) October 30, 2023
విక్రాంత్ మాస్సే ఈ సినిమాలో మనోజ్ అనే IPS ఆస్పిరంట్(Aspirant)గా కనిపించబోతున్నాడు. చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు UPSC ప్రిపరేషన్ కోసం వచ్చిన విక్రాంత్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది కథాంశం. ఇక UPSC కోసం ప్రయత్నించే లక్షలాది విద్యార్థుల నిజమైన కథల నుంచి ఈ చిత్రం రూపొందుతుందని మేకర్స్ తెలిపారు.