న్యూఢిల్లీ : భారీ కొండచిలువ మహిళ బాత్రూంలోకి వచ్చిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ ఘటన జరిగింది. బాత్రూంలో నుంచి బయటకు వచ్చేందుకు 12 అడుగుల పొడవున్న కొండచిలువ ప్రయత్నించగా అక్కడున్న గ్లాస్ విండో అడ్డుగా నిలిచింది.
గ్లాస్ విండో వెలుపల రెండు పిల్లి పిల్లలు కొండచిలువను చూస్తూ బిక్కు బిక్కు మంటున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. ఆపై యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పామును కాపాడి తమతో తీసుకువెళ్లారు. నౌదిస్ అకౌంట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా టాయ్‌లెట్ నుంచి బాత్రూంలో ఎంటరైన కొండచిలువ అనే క్యాప్షన్ ఇచ్చారు.