హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బీకామ్, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులతోపాటు పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు రూ.200 ఆలస్య రుసుముతో గడువును నవంబర్ 11 వరకు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ర్టాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, వివరాలకు www.braouonline.in చూడాలని సూచించారు.