బీజింగ్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి చైనాలోని ఓ వంతెన కుప్పకూలింది. షాక్సీ, సిచువాన్ ప్రావిన్స్ ఝాషుయ్ కౌంటీలో జాతీయ రహదారిపై నిర్మించిన వంతెన ఆకస్మిక వరదల తాకిడికి కూలింది. ఈ ఘటనలో కనీసం 12 మంది చనిపోయి వుంటారని, మరో 60 మందికిపైగా గల్లంతయ్యారు.