దేశంలో 11.9 లక్షల అధిక కొవిడ్ మరణాలు
భారత్లో 2020లో నమోదైన కొవిడ్ మరణాల్లో సుమారు 11.9 లక్షల మరణాలు అధికం అని ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. అధికారిక లెక్కల కన్నా ఆ మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువ అని తెలిపింది.
- అధికార లెక్కల కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువ
- ఆదివాసీలు, దళితులు, ముస్లింలపై తీవ్ర ప్రభావం
- అణగారిన వర్గాల్లో భారీగా తగ్గిన ఆయుర్దాయం
- ఆక్స్ఫర్డ్ వర్సిటీ, న్యూయార్క్ సిటీ వర్సిటీ సర్వే
- సర్వే నిర్వహణ తప్పు : నీతిఆయోగ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భారత్లో 2020లో నమోదైన కొవిడ్ మరణాల్లో సుమారు 11.9 లక్షల మరణాలు అధికం అని ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. అధికారిక లెక్కల కన్నా ఆ మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువ అని తెలిపింది. కొవిడ్ వచ్చిన తొలి ఏడాది ఆదివాసీలు, దళితులు, ముస్లిం జనాభాలో ఎక్కువ శాతం మరణాలు సంభవించాయని వివరించింది. అందులో పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా మరణించారని తేల్చింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సోసియాలజిస్ట్, న్యూయార్క్ సిటీ యూనివర్సిటీకి చెందిన ఎకనామిస్ట్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం చేపట్టింది.
వయసు, లింగం, సామాజిక వ్యత్యాసం ఉన్నవారిపై కరోనా ప్రభావం ఎంతలా పడిందన్న కోణంలో ఈ అధ్యయనం చేశారు. ఈ సర్వే ప్రకారం.. మహిళలు, అణగారిన వర్గాల ఆయుర్దాయం ఎక్కువగా తగ్గింది. సామాజిక వర్గాల ప్రకారం చూస్తే.. ముస్లింలలో ఎక్కువగా ఆయుర్దాయం 5.4 ఏండ్లు తగ్గింది. ఎస్టీలు 4.1 ఏండ్లు, ఎస్సీలు 2.7 ఏండ్లు తగ్గినట్టు సర్వే తెలిపింది. హిందువుల్లో ఉన్నత కులాలు, ఓబీసీల జీవిత కాలం 1.3 ఏండ్లు మాత్రమే తగ్గిందని వివరించింది. ఇలాంటి మార్పులు వేరే ఏ దేశంలోనూ చోటుచేసుకోలేదని వెల్లడించింది. మహిళల్లో 17 శాతం మరణాలు అధికంగా నమోదయ్యాయని అధ్యయనం తేల్చింది.
నీతి ఆయోగ్ అభ్యంతరం
తాజా అధ్యయనంపై నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ స్పందించారు. అధ్యయన నిర్వహణలో చాలా తప్పులు ఉన్నాయని తెలిపారు. సర్వే మెథడాలజీ సరిగా లేదని, దానివల్లే తప్పుడు అంచనాలు రూపొందించారని వెల్లడించారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం 99 శాతం మరణాలు రిజిస్టర్ అయ్యాయని వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

