ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక బామ్మ కరోనా టీకా వేయించుకుని వందవ పుట్టిన రోజు జరుపుకున్నారు. ముంబైలోని అంధేరిలో నివాసం ఉండే ప్రభుతి ఖేద్కర్ శుక్రవారం ఆశ్చర్యానికి గురయ్యారు. కరోనా టీకా కోసం ఆమె బాంద్రా కుర్లా కాంపెక్స్లోని బీఎంసీ కరోనా ఆసుపత్రికి వెళ్లారు.
అయితే 1921 మార్చి 5న జన్మించిన ఆమె శుక్రవారం వందో ఏట ప్రవేశించినట్లు కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి తెలిపారు. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ధ్రువీకరించుకున్న సిబ్బంది వెంటనే ఒక కేక్ తెప్పించి ఆ బామ్మతో కట్ చేయించారు. దీంతో ఆమె వచ్చిన కుటుంబ సభ్యులు కూడా ఒకింత ఆశ్చర్యపోయారు.
#WATCH | A 100-year-old woman received COVID-19 vaccine and celebrated her birthday with healthcare workers at BKC Jumbo vaccination centre in Mumbai yesterday. pic.twitter.com/ngwQEA7UWG
— ANI (@ANI) March 6, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.