ఇండిగో ఆఫర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వ్యాక్సిన్ వేసుకున్న విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో. రెండు డోస్‌లు వేసుకున్నవారికి విమాన టిక్కెట్లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణానికి 15 రోజుల ముందు బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ ఇస్తున్నది. దేశీయంగా నడుస్తున్న అన్ని విమాన సర్వీసులకు ఈ ఆఫర్ వర్తించనున్నదని, బేస్ ఫేర్‌లో పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందుకోసం ‘వ్యాక్సి ఫేర్’తో ప్రత్యేక స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది ఆగస్టులోనే ఈ స్కీంను ప్రవేశపెట్టిన సంస్థ..మళ్లీ ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది.