సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): సుచిత్ర సర్కిల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవీ గ్రూపు నిర్మించిన వాసవీ నందనం హౌసింగ్ ప్రాజెక్టును సోమవారం ప్రారంభించారు. 4.18 ఎకరాలు.. 5 టవర్లలో 2,3 బీహెచ్‌కే ఫ్లాట్లను నిర్మించారు. ఈ టవర్లను గుల్మొహర్, తామర, మందార, మనోహరం, పారిజాతం పేర్లతో ఏర్పాటు చేశారు. అత్యంత ఆకర్షణీయంగా అపార్టుమెంటు ప్రాజెక్టును నిర్మించామని వాసవీ గ్రూపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ ఎర్రం తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టుగా నిర్మించామని తెలిపారు. ఇందులో నివాసముండే వారి కోసం 3 అంతస్థుల్లో ఎంతో అధునాతనమైన క్లబ్ హౌస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. దీంతో పాటు 20 రకాల ప్రపంచ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలను నివాసితులకు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీ గ్రూపు డైరెక్టర్లు అభిషేక్ చంద, సౌమ్య చందాతో పాటు పలువురు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.