షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 2: ఫరూఖ్‌నగర్ మండలంలోని హాజిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల హరితవనంగా మారి విద్యార్థులతోపాటు గ్రామస్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నది. పాఠశాలలో గతంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగా యి. సుమారు ఎకరం స్థలంలో విద్యార్థులు టేకు, దానిమ్మ, కొబ్బరి, మామిడి, వేప, ఉసిరి, జామ, గొరింటాకు, కానుగ తదితర ఎన్నో రకాల మొక్కలను నాటారు. వాటిని విద్యార్థులే సంరక్షిస్తున్నా రు. మొక్కలకు ఉదయం, సాయంత్రం సమయాల్లో నీరు పోసి కాపాడుతున్నారు. పచ్చని మొక్కల మధ్య చదువు కుం టే మనస్సుకు ప్రశాంతతతోపాటు, జ్ఞాపక శక్తి పెరుగుతున్నదని విద్యార్థులు చెబుతున్నారు.
వంద శాతం ఉత్తీర్ణత..
పాఠశాలలోని విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రాణిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు 2017లో జరిగిన మీలో విజేత ఎవరూ పోటీల్లో పాల్గొని ఐదో స్థానంలో నిలిచారు. మండల స్థాయిలో జరిగిన పద్యాల పోటీల్లోనూ పలుమార్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
నాటక రంగంలో నంది అవార్డు.
ఈ పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు నాటక రంగంలోనూ రాణిస్తున్నారు. 2012- 2013లో జరిగిన కిన్నెర పోటీల్లో నాటక విభాగంలో నంది అవార్డు ను సొంతం చేసుకున్నారు. జిల్లా స్థాయిలోనూ అనేకసార్లు ప్రథమ బహుమతిని పొందారు.
గ్రామానికి నిర్మల్ పురస్కారం..
నిర్మల్ పురస్కారాన్ని హాజిపల్లి కైవసం చేసుకోవడంతో ఎంతోమంది ఉన్నతాధికారులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. వారు పాఠశాలను సందర్శించి, విద్యార్థుల ప్రతిభను గుర్తించి అభినందిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో విద్యార్థులు చేసిన నృత్యాలకు పలుమార్లు అవార్డులు వరించాయి.
విద్యార్థులు మొక్కలను సంరక్షిస్తున్నారు..
పాఠశాలలో 47 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు మొక్కల తో కలిగే లాభాలను వివరిస్తున్నాం. నాటిన ప్రతి మొక్కనూ వారు సంరక్షిస్తున్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించడం సంతోషం గా ఉన్నది.-కిశోర్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు హాజిపల్లి
పాఠశాల అభివృద్ధికి కృషి
పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా. గ్రా మంలోని చిన్నారులందరూ పాఠశాలలో చేరేలా అవగాహన కల్పించడం జరిగింది. పాఠశాలలో హరితహారం లో భాగంగా విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షిస్తు న్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి.
-మౌనికామశ్చేందర్, సర్పంచ్ హాజిపల్లి