
మహ్మదాబాద్, ఆగస్టు 23 : గ్రామాల్లో పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేయొద్దని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మండలకేంద్రంలో దోమల నివారణకోసం చేపట్టిన పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు పారిశుధ్య పనులపై పర్యవేక్షణ పెంచడంతోపాటు దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాల్లో ఫాగింగ్ చేయించాలని, మురుగునీటి గుంతల్లో ఆయిల్‌బాల్స్ వేయాలని ఆదేశించారు. కాగా, బీసీ కాలనీకి తాగునీటి సరఫరా సక్రమంగా లేదని పలువురు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, మిషన్ భగీరథ ఏఈతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, ఎంపీవో శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ కోరారు. సోమవారం మున్సిపాలిటీలోని 10వ వార్డులో దో మలపై సమరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే ఇండ్ల మధ్యను న్న నీటి గుంతలను పరిశీలించారు. డ్రైనేజీల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నూరుల్‌నజీబ్, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, నారాయణగౌడ్, నర్సింహగౌడ్, అశోక్‌గౌడ్ పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జెడ్పీటీసీ అన్నపూర్ణ అన్నా రు. మండలంలోని కౌకుంట్లలో సర్పంచ్ స్వప్నతో కలిసి గ్రామంలో పర్యటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీ సుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ సుజాత, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యం సాధించినప్పుడే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని డీసీవో, మండల ప్రత్యేకాధికారి సుధాకర్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శు లు, సర్పంచులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజ రై మాట్లాడారు. సీజనల్ వ్యాధులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రధానంగా మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవడంతోపాటు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, వైద్యాధికారి నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, ఎంపీవో భద్రునాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
దోమల వృద్ధిని అరికట్టాలి
దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలని డాక్టర్ ప్రతాప్చౌహాన్ అన్నారు. దోమలపై సమరం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలకేంద్రంలో ఇంటింటికీ వెళ్లి నిల్వనీటిని పారబోశారు. అలాగే మురుగుకాల్వల్లో బ్లీచింగ్‌పౌడర్ చల్లారు. ఇంటి ఆవరణలో మురుగునీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సూపర్వైజర్ ప్రసన్న, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో డ్రైడే
మండలంలోని హేమాజీపూర్, గాంధీపాలం, గుండేడ్ తదితర గ్రామాల్లో సోమవారం డ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి నిల్వనీటిని తొలగించడంతోపాటు బ్లీచింగ్‌పౌడర్ చల్లించారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు శోభారాణి, సంధ్య, జయమ్మ, అలియా తదితరులు ఉన్నారు.
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
అడ్డాకుల, మూసాపేట మండలకేంద్రాలతోపాటు కందూరు, పొన్నకల్, శాఖాపూర్, రాచాల, పెద్దమునగల్‌చేడ్, నిజాలాపూర్, నందిపేట, సంకలమద్ది, జానంపేట, చక్రాపూర్, వేముల దాసరిపల్లి గ్రామాల్లో దోమలపై సమరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల వృద్ధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.