హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ సిబ్బందికి జాతీయ స్థాయిలో ‘అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్-2023’ పేరుతో ఏడు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను ఈ నెల 15న న్యూఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులమీదుగా ప్రదానం చేయనున్నారు. డీఎస్ రామారావు, సీహెచ్ దినేశ్‌రెడ్డి, మల్లెల శ్రీకాంత్, సీ శివకుమార్ కశ్యప్, టీ ప్రత్యూష, టీ నటరాజన్, వీవీ రంగయ్య ఈ జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.