న్యూఢిల్లీ, అక్టోబర్ 29:గత నెలలో కీలక రంగాలు 4.4 శాతం వృద్ధిని కనబరిచాయి. సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడం ఇందుకు దోహదం చేశాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 0.6 శాతంగా ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో నమోదైన 11.5 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. సహజ వాయువు ఉత్పత్తి 27.5 శాతం పెరుగగా, రిఫైనరీ ఉత్పత్తుల్లో 6 శాతం, సిమెంట్ ప్రొడక్షన్లో 10.8 శాతం చొప్పున వృద్ధిని సాధించాయని ఈ నివేదిక వెల్లడించింది. కానీ, క్రూడాయిల్ ఉత్పత్తి మాత్రం 1.7 శాతం తగ్గింది.