హైదరాబాద్, ఆట ప్రతినిధి: అబుదాబి వేదికగా జరిగే ఆసియా సెయిలింగ్ చాంపియన్‌షిప్‌నకు రాష్ర్టానికి చెందిన వత్సల్, సంజయ్‌రెడ్డి ఎంపికయ్యారు. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన వీరిద్దరు ఆసియా టోర్నీలో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఇందుకోసం కర్ణాటక యాచింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 45 రోజుల శిక్షణాశిబిరంలో వత్సల్, సంజయ్ తర్ఫీదు పొందారు.