సిరికొండ, సెప్టెంబర్ 3 : అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని సిరికొండ ఎంపీపీ పెందూర్ అమృత్రావ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. ప్రజాప్రతినిధులు పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో చాలా అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు. మిషన్ భగరీథ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చాలని సూచించారు. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులు చేయాలని అన్నారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు రాకుండా కిందిస్థాయి అధికారులు హాజరుకావడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ కుమ్రం చంద్రకళ, నాయబ్ తహసీల్దార్ శంకర్, వ్యవసాయాధికారి జాదవ్ కైలాస్, మండల పశువైద్యాధికారి సురేశ్, ఎంపీవో శేషారావ్, మండల కో- ఆప్షన్ సభ్యులు మానిక్ రావ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.