న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7,8 తేదీల్లో రెండు రోజుల పాటు మలేషియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన వాణిజ్యం, శక్తి, సముద్ర భద్రత, పెట్టుబడులు తదితర అంశాలపై ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
కాగా, ప్రధాని మోదీ మలేషియాను సందర్శించడం ఇది మూడోసారి కాగా, భారత్-మలేషియాల మధ్య 2024 ఆగస్టులో విస్తృత, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ద్వైపాక్షిక ఒప్పందం జరిగిన అనంతరం పర్యటించడం మొదటిసారి. శని, ఆదివారం జరిపే పర్యటనలో మోదీ.. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని, అక్కడ నివసిస్తున్న భారతీయులు, వాణిజ్య, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.