
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): వరంగల్లో వచ్చేనెల 15న తెలంగాణ విజయగర్జన సభ నిర్వహణకు టీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నది. ఈ సభ సక్సెస్ వ్యూహాన్ని ఖ రారు చేయడంలో నిమగ్నమైంది. దీనిలో భా గంగా బుధవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాలు జరుగనున్నాయి. పార్టీ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మండల, గ్రామ, వార్డు పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల బా ధ్యులు సహా నియోజకవర్గంలోని ముఖ్యనేతలు సమావేశమై విజయగర్జన సభను విజయవంతం చేయడంపై చర్చించనున్నారు. ఈ సభకు తరలివచ్చే సాధారణ ప్రజలకు వాహన సౌకర్యం కల్పించడంతోపాటు ఇతర అన్ని అంశాలపై సమాలోచన జరుపనున్నారు.
ఈ విషయమై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మం త్రి కేటీఆర్ ఈ నెల 18 నుంచి 23 వరకు అన్ని నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏండ్లు పూ ర్తయిన సందర్భంగా వరంగల్లో ద్విదశాబ్ది ఉత్సవాలను అద్వితీయంగా నిర్వహించుకోవాలని పార్టీ నిర్ణయించింది. విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు క దలాలని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.