హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ)లో పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ 
విడుదలైంది.
కోర్సులు: ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ

స్పెషలైజేషన్ల వారీగా సీట్ల వివరాలు
ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)-113 సీట్లు
ఎమ్మెస్సీ (కమ్యూనిటీ సైన్స్)-18 సీట్లు
పీహెచ్డీ (అగ్రికల్చర్)- 29 సీట్లు
పీహెచ్డీ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)- 1
అర్హతలు: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో నాలుగేండ్ల వ్యవధి గల (బీఎస్సీ / బీఎస్సీ ఆనర్స్) లేదా అగ్రికల్చర్/ హార్టికల్చర్/ హోం సైన్స్/ కమ్యూనిటీ సైన్స్ /ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్). బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ). బీహెచ్ఎస్సీ (రూరల్)/ బీహెచ్ఎస్సీ/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎఫ్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐకార్ – ఏఐఈఈఏ (పీజీ) 2021 (ఐకార్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) రాసి ఉండాలి.
పీహెచ్‌డీలో ప్రవేశానికి సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)/ ఎంటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)/ ఎమ్మెస్సీ (హోం సైన్స్) పూర్తిచేసి ఉండాలి. ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2021 ఎగ్జామ్ రాసి ఉండాలి.
వయస్సు: 2021 డిసెంబరు 31 నాటికి 40 ఏండ్లు మించరాదు.
ఎంపిక విధానం
పీజీ కోర్సుల్లో ప్రవేశానికి డిగ్రీ స్థాయి మార్కులకు 30 శాతం, ఐకార్- ఏఐఈఈఏ(పీజీ) 2021 (ఐకార్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) స్కోర్‌కు 70 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి డిగ్రీ స్థాయి మార్కులకు 10 శాతం, పీజీ స్థాయి మార్కులకు 30 శాతం, ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎప్ఆర్ఎఫ్(పీహెచ్డీ) 2021 స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు: దరఖాస్తు: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1800
దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ: నవంబర్ 25
దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ: నవంబర్ 27
వెబ్సైట్:https://www.pjtsau.edu.in