Pulitzer prize winner danish siddiqui | ఇటీవల అఫ్ఘానిస్థాన్‌లో సైన్యం, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన భారతీయ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధికీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. భారత్‌లో కరోనా మరణాలపై ఆయన తీసిన ఫొటోలకు గానూ పులిట్జర్ అవార్డు వరించింది. సిద్దిఖీ పులిట్జర్ అవార్డు గెలుచుకోవడం ఇది రెండోసారి. అంతకుముందు 2018లో మయన్మార్‌లోని రొహింగ్యా శరణార్థుల ఫొటోలకు తొలిసారి పులిట్జర్ అవార్డు గెలుచుకున్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సమయంలో జరిగిన ఘర్షణలను కవర్ చేసేందుకు వెళ్లిన సమయంలో డానిష్ సిద్దిఖీ తీసిన ఫొటో. ఇదే ఆయన చివరి చిత్రం కావడం గమనార్హం.
మయన్మార్‌లోని రొహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ తరలివెళ్లినప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ ఫొటోకే డానిష్ సిద్దిఖీ తొలిసారి పులిట్జర్ అవార్డు గెలుచుకున్నారు.