Sankranti Festival | సంక్రాంతి అంటేనే ఇంటి ముందు అందమైన రంగవల్లులు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు.. కాంక్రాట్ జంగల్‌గా మారిన హైదరాబాద్ మహానగరంలో ఇలాంటివి అత్యంత అరుదుగా కనిపిస్తాయి. హైటెక్‌సిటీ సమీపంలోని శిల్పారామంలో సంక్రాంతి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.