హైదరాబాద్ రోడ్లపై ప్రయాణం అంటేనే నరకప్రాయంగా ఉండేది. అదే వర్షం పడితే ఇక అంతే సంగతులు. అలాంటిది ఓ వైపు చిరుజల్లులు.. మరోవైపు పచ్చటి అందాల నడుమ నానక్‌రామ్‌గూడ రహదారిపై ప్రయాణం ఆహ్లాదకరంగా మారింది. మంగళవారం కురిసిన చిరుజల్లులతో ఆ రోడ్డు గుండా ఇలా వాహనదారులు రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్లారు. అలాగే చుట్టూ గుట్టలు.. మధ్యలో ఉన్న దుర్గం చెరువులో పర్యాటకులు బోటులో భలే ఎంజాయ్ చేశారు.