ఎట్టకేలకు పాలమూరు మోటర్ ఆన్.. నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి కృష్ణా జలాలు
ఎట్టకేలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్-1లోని మోటర్ ఆన్ అయ్యింది. నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోతను అధికారులు ప్రారంభించారు. 2023 సెప్టెంబర్ 16న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లిఫ్ట్-1లోని తొలి పంప్‌ను ప్రారంభించగా.. నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి సుమారు 2 టీఎంసీల నీటిని బాహుబలి మోటర్ ఎత్తిపోసింది.
- మధ్యాహ్నం ఒంటిగంటకు నీటి లిఫ్టింగ్ ఆఫ్
- బీఆర్ఎస్ నేతల ఒత్తిడి.. ‘నమస్తే’ కథనంతో కదలిక
కొల్లాపూర్, సెప్టెంబర్ 17 : ఎట్టకేలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్-1లోని మోటర్ ఆన్ అయ్యింది. నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోతను అధికారులు ప్రారంభించారు. 2023 సెప్టెంబర్ 16న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లిఫ్ట్-1లోని తొలి పంప్‌ను ప్రారంభించగా.. నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి సుమారు 2 టీఎంసీల నీటిని బాహుబలి మోటర్ ఎత్తిపోసింది. కాగా నాడు ఎత్తిపోసిన 2 టీఎంసీల నీళ్లు మాత్రమే నార్లాపూర్ రిజర్వాయర్‌లో నిల్వ ఉన్నాయని, మూడేండ్లలో చుక్క నీరు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నీటిని ఎత్తిపోయలేదని.. ‘పాలమూరు ఉప్పొంగి మూడేండ్లు’ అంటూ బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదిలిక వచ్చింది. గురువారం ఉదయం 11:40 గంటలకు కేసీఆర్ ఆన్ చేసిన మొదటి పంపును తిరిగి ప్రారంభించారు.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు సుమారు గంటా 20 నిమిషాలపాటు నడిపి దాదాపు 3 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసినట్టు ప్రాజెక్టు వర్గాల సమాచారం. గత జూలై నెలలో 14, 17వ తేదీల్లో ట్రయల్ రన్ పేరుతో కొద్ది సేపు మాత్రమే పంపులను ఆన్ చేసి మళ్లీ నిలిపివేశారు. ఇటీవల పాలమూరు ప్రాజెక్టు పంపులను ఆన్ చేయాలంటూ బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న ఒత్తిడితో శుక్రవారం నుంచి పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1లోని మొదటి, రెండో పంప్‌లను నడిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
వచ్చే వారంలో మూడు, నాలుగో పంపులను కూడా ప్రారంభించి నార్లాపూర్ రిజర్వాయర్‌లో 4 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో 90 శాతానికిపైగా పనులు పూర్తయినా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలో పెండింగ్ పనులను పూర్తి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పీఆర్ఎల్ఐ మోటర్ మళ్లా ప్రారంభం కావడంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎట్టకేలకు నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి మూడేండ్ల తరువాత నీళ్లు వస్తున్నాయన్న సమాచారంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
నిరంతరాయంగా పంపులను నడుపాలి
ప్రస్తుతం కరువు నుంచి బయట పడాలంటే ప్రభుత్వం వెంటనే పీఆర్ఎల్ఐ స్టేజీ-1లో సిద్ధంగా ఉన్న నాలుగు పంపులను నిరంతరాయంగా నడుపాలి. శ్రీశైలం జలాశయం నుంచి నార్లాపూర్, ఏదుల, వెట్టెం, కరివెన రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలి. నార్లాపూర్ రిజర్వాయర్‌కు ఏర్పాటు చేసిన స్లూయిస్ ద్వారా ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులోని రిజర్వాయర్లకు సాగునీరు అందించి పంటలను కాపాడాలి.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

