కాలం కాని కాలంలో అపూర్వ జలదృశ్యమిది. సీఎం కేసీఆర్ కృషితో సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందంపేట వద్ద కూడవెల్లి వాగు జలసవ్వడి చేస్తున్నది. ఎండుతున్న పంటలకు ఊపిరిపోస్తున్న గోదారమ్మ.. సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరుకు పరుగులు తీస్తున్నది. మార్చి 6న మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లికి గోదావరి జలాలను విడుదల చేయగా.. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని 260కిపైగా చెక్‌డ్యామ్‌లు నిండాయి.
-సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి