Colonel Santosh Babu accorded Mahavir Chakra | దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన తెలంగాణకు చెందిన కల్నల్ సంతోశ్ బాబును మహా వీర్ చక్ర పురస్కారంతో కేంద్రం గౌరవించింది. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేంది. మరణానంతరం ఇచ్చిన పురస్కారాన్ని సంతోశ్ బాబు సతీమణి అందుకున్నారు. గత ఏడాది గాల్వన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు అమరుడైన సంగతి తెలిసిందే.