Bilateral Macrostamia | చిరునవ్వు చిందిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ ముద్దులొలికే చిన్నారి పేరు ఐలా సమ్మర్ ముచా. గత డిసెంబర్లో ఆస్ట్రేలియాలో పుట్టింది. అయితే, ఫొటోలో కనిపిస్తున్నట్టు ఆ పాప నిజంగా నవ్వట్లేదు. బైలేటరల్ మైక్రోస్టోమియా అనే అరుదైన వ్యాధి కారణంగా పాప పెదాలు ఇలా సాగినట్టు మారాయి. నోరు పెద్దగా ఉండటంతో ఐలా పాలు కూడా తాగలేకపోతున్నది. దీంతో వైద్యులు సర్జరీ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రపంచంలో ఈ తరహా కేసులు 14 వరకు ఉన్నాయట.