న్యూఢిల్లీ, మార్చి 20: ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో’ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ప్ల్లాట్‌ఫామ్ ఫీజుల్ని పెంచింది. ప్రతి ఒక్క ఫుడ్ ఆర్డర్‌పై ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.12.50 ఫీజును రూ.14.90కు పెంచుతున్నట్టు ‘జొమాటో’ యాప్‌లో శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది.
ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.2.40 మేరకు పెంచుతూ జొమాటో తీసుకున్న నిర్ణయం, దేశవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లపై ప్రభావం చూపనున్నది. వారి ఫుడ్ ఆర్డర్లు మరింత ఖరీదైనవిగా మారుతాయి. ప్రధాన పోటీదారు ‘స్విగ్గీ’ చాన్నాళ్లుగా రూ.14.99 ప్లాట్‌ఫామ్ ఫీజుగా వసూలు చేస్తున్నది.