న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో( Zomato Ad ) బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్‌తో రూపొందించిన యాడ్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ యాడ్స్‌ను ట్రోల్ చేస్తూ ఎంతో మంది కామెంట్స్ చేస్తుండటంతో కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ యాడ్స్‌లో తమ డెలివరీ ఏజెంట్లను హీరోలుగా చూపించే ప్రయత్నం జొమాటో చేసింది. కత్రినా, హృతిక్ లాంటి స్టార్లకు డెలివరీ ఇచ్చిన తర్వాత.. వాళ్లు సెల్ఫీల కోసం వెయిట్ చేయమని లోనికి వెళ్లి వచ్చే లోపు మరో ఆర్డర్ రావడంతో ఏజెంట్లు వెళ్లిపోతారు. తమ కంపెనీ, డెలివరీ ఏజెంట్లు ఎంత నిబద్ధతతో పని చేస్తారో ఈ యాడ్స్ ద్వారా జొమాటో చెప్పాలనుకుంది.
అయితే వీటిని చూసిన నెటిజన్లు మాత్రం ఆ సంస్థపై విరుచుకు పడ్డారు. మీ డెలివరీ ఏజెంట్లతో ఈ స్థాయిలో పని చేయించుకుంటారా? ఇది శ్రమ దోపిడీ.. ఇలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలకు పెద్ద మొత్తం ఇచ్చి యాడ్స్ చేయించుకునే బదులు.. మీ డెలివరీ ఏజెంట్లకు కాస్త ఎక్కువ చెల్లించి వాళ్ల జీవితాలను నిలబెట్టండి అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా జొమాటోకు క్లాస్ పీకారు. దీంతో ఆ సంస్థ వెంటనే ఓ వివరణ ఇచ్చింది. తమ ఉద్దేశాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
Ordered samosa on @zomato and… koi mil gaya 😄😄#Ad pic.twitter.com/NnLny7W7gM
— Hrithik Roshan (@iHrithik) August 26, 2021
The other side of the story… pic.twitter.com/hNRj6TpK1X
— zomato (@zomato) August 30, 2021