లడాఖ్: హిమాలయాల్లో కొత్త టన్నెల్ సిద్దమైంది. జొజి-లా సొరంగం తొవ్వకం పూర్తి అయ్యింది. సుమారు 13.15 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ టన్నెల్‌కు చెందిన బ్రేక్‌త్రూ పనులు ఇవాళ జరిగాయి. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బ్రేక్‌త్రూ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని వాతావరణాలకు తగిన రీతిలో టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. 13.15 కిలోమీటర్ల దూరం ఉన్న టన్నెల్‌కు చెందిన తొవ్వకాల పనులు పూర్తి అయినట్లే. అయితే ఈ టన్నెల్ ప్రజల కోసం వినియోగంలోకి రావాలంటే మరో రెండేళ్లు పట్టనున్నది.
2028 సంవత్సరంలో జొజి-లా సొరంగ మార్గం ప్రజలకు అందుబాటులోకి రానున్నది. జమ్మూకశ్మీర్‌తో పాటు లడాఖ్ మధ్య ఈ సొరంగం కీలకం కానున్నది. రవాణా, రక్షణ రంగంతో పాటు పర్యాటక రంగానికి ఈ టన్నెల్ ఉపయోగపడనున్నది. అత్యంత ఎత్తులో నిర్మిస్తున్న ఈ టన్నెల్లో సింగిల్ ట్యూబ్ బై డైరెక్షనల్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో మంత్రి నితిన్ గడ్కరీతో పాటు కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు.
తెలంగాణకు చెందిన మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సంస్థ ఈ టన్నెల్‌కు ప్రాజెక్టు డెవలపర్‌గా చేసింది. జొజిలా ప్రాంతంలో సొరంగాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సోనామార్గ్‌లోని బల్తాల్, ద్రాస్‌లోని మీనామార్గ్, జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌తో పాటు లడాఖ్ మధ్య ఈ సొరంగం వల్ల ట్రాన్స్‌పోర్టు సమస్యలు తీరనున్నాయి. టన్నెల్ తొవ్వకాలు పూర్తి కావడం వల్ల బ్రేక్‌త్రూ ఈవెంట్‌ను నిర్వహించినట్లు అధికారులు చెప్పారు.
టన్నెల్ వంద శాతం పూర్తి అయిన తర్వాత 365 రోజుల పాటు శ్రీనగర్, లడాఖ్ మధ్య రాకపోకలు ఉంటాయి. టన్నెల్లో రోడ్డు నిర్మాణం, లైటింగ్ పనులు ఇంకా జరగాల్సి ఉంది.
#WATCH | Union Minister of Road Transport & Highways Nitin Gadkari triggers the Zoji-La tunnel final breakthrough. The strategically significant 13.15-kilometre Zoji-La Tunnel will link Jammu and Kashmir with Ladakh
This marks a major milestone in India’s infrastructure history… pic.twitter.com/dbd9KzO4vF
— ANI (@ANI) June 9, 2026