న్యూఢిల్లీ: ‘నీట్’ అవకతవకలపై ఆందోళనలు, జంతర్‌మంతర్ వద్ద నిరసనల నేపథ్యంలో ఓటీటీ వేదిక ‘జీ5’ ‘ది స్కామ్: లీక్డ్’ పేరుతో సిరీస్‌ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ టీజర్లో ప్రశ్నపత్రాల ముద్రణ, అత్యంత గోప్యంగా వాటిని సీల్ చేయడం, ప్యాక్ చేయడం తదితర దృశ్యాలను చూపించారు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకునే దృశ్యాలను పొందుపరిచారు. కాగా ఈ సిరీస్ విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.