ఇండోర్: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటుకు నడుం బిగించారు. 100 పడకల కోవిడ్ హాస్పిటల్‌ను నిర్మించేందుకు యువరాజ్ సింగ్ ఫౌండేషన్ సిద్ధమైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ డీన్ సంజయ్ దీక్షిత్ ఈ విషయాన్ని తెలిపారు. యువరాజ్ సింగ్ ఫౌండేషన్ నుంచి తమకు ఓ లేఖ అందిందని, 100 బెడ్స్ కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు కావాల్సిన సదుపాయాలను కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు యువీ ఫౌండేషన్ ఆ లేఖలో తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఆ హాస్పిటల్ నిర్మాణం కోసం 30 రోజుల వ్యవధి కోరినట్లు చెప్పారు. యువీ ఫౌండేషన్ పంపిన లేఖను ఆమోదించినట్లు ఎంజీఎం మెడికల్ కాలేజీ డీన్ సంజయ్ దీక్షిత్ తెలిపారు.
We've received a letter from Yuvraj Singh Foundation, stating that they're willing to provide infrastructure needed to set up 100-bedd critical COVID hospital. They've sought 20-30 days time. We've sent acceptance letter: Dr Sanjay Dixit, Dean, MGM Medical College, Indore (28.05) pic.twitter.com/osyj6pM7H3
— ANI (@ANI) May 29, 2021