పుణే: మహారాష్ట్రలోని బారామతి శాసనసభ నియోజకవర్గంలో బాబాయ్, అబ్బాయి తలపడుతున్నారు. వచ్చే నెలలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం 45 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఎన్సీపీ (ఎస్పీ) గురువారం విడుదల చేసింది. బారామతి నుంచి యుగేంద్ర పవార్ పోటీ చేస్తారని తెలిపింది. ఈ నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ పోటీ చేస్తున్నారు. అజిత్ తమ్ముడి కుమారుడే యుగేంద్ర. ఎన్సీపీ (ఎస్పీ) తొలి జాబితాలో టికెట్లు పొందినవారిలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్ పాటిల్, జితేంద్ర అవహద్, అనిల్ దేశ్ముఖ్, హర్షవర్ధన్ పాటిల్ ఉన్నారు.