ఆదివారం 24 మే 2020
National - Mar 09, 2020 , 12:23:50

'మద్యం ధరలు తగ్గించాలంటావా?'

'మద్యం ధరలు తగ్గించాలంటావా?'

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై  వైసీపీ  ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు జరగడం చంద్రబాబుకు ఇష్టం లేదని, వాయిదా పడాలని చంద్రబాబు భావిస్తున్నాడని  విజయ సాయిరెడ్డి ట్విటర్లో విమర్శించారు. 

రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేకపోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళా కోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు  సలహా ప్రకారం నడుచుకో.

స్థానిక ఎన్నికల్లో ఏమని ఓట్లు అడుగుతావు బాబూ? ‘ఇన్ సైడర్’ భూముల ధరలు పడిపోకుండా చూడాలని ప్రాధేయపడతావా? ఇళ్ల పట్టాలెందుకు ఎలాగోలా ఇప్పుడు బతకడం లేదా అని అంటావా? మందు, డబ్బు పంచకుండా ఎన్నికలు ఎలా  జరుపుతారని ప్రశ్నిస్తావా?  కుటుంబాలు వీధిలో పడితేనేం మద్యం ధరలు తగ్గించాలంటావా? అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 


logo