న్యూయార్క్ : ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మిస్టర్బీస్ట్గా పేరొందిన జిమ్మీ డొనాల్డ్సన్ రెస్టారెంట్ వెయిట్రెస్‌కు ఏకంగా బ్రాండ్ న్యూ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (viral video )మారింది. యూట్యూబ్‌లో 13.9 కోట్ల మంది సబ్స్క్రైబర్లు కలిగిన మిస్టర్‌బీస్ట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ వీడియోలో రెస్టారెంట్ వెయిట్రెస్‌కు తన బిజినెస్ వెంచర్స్‌ను ప్రమోట్ చేసే లోగోలతో కూడిన బ్రాండ్ న్యూ కార్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం కనిపిస్తుంది. నీవు ఇప్పటివరకూ అందుకున్న అత్యధిక టిప్ ఎంత అని బీస్ట్ వెయిట్రెస్‌ను అడగ్గా ఆమె 50 డాలర్ల వరకూ ఉంటుందని బదులిస్తుంది. ఇప్పటివరకూ ఎవరైనా టిప్‌గా కారు ఇచ్చారా అని అడుగుతూ కారు కీస్‌ను వెయిట్రెస్‌కు అప్పగించగా ఆమె ఆశ్చర్యానికి లోనవవుతుంది.
ఆపై కారును పార్క్ చేసిన ప్రదేశానికి వెయిట్రెస్‌ను తీసుకువెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు. బ్లాక్ టయోటా కారును వెయిట్రెస్‌కు మిస్టర్ బీస్ట్ టిప్‌గా అందించాడు. కారుపై తన చాక్లెట్ కంపెనీ ఫీస్టబుల్ లోగో కనిపిస్తుంది. కొత్త వ్యక్తి నుంచి ఊహించని విధంగా ఖరీదైన టిప్ అందుకోవడంతో వెయిట్రెస్ అమీ కన్నీళ్లు ఉబికివస్తుండగా ఉద్వేగానికి లోనవుతుంది. డొనాల్డ్సన్ ఔదార్యం నెటిజన్ల మనసులను గెలిచింది. యూట్యూబర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ కామెంట్స్ సెక్షన్ హోరెత్తింది.
Read More