రాయ్‌పూర్, జూలై 18: ఛత్తీస్‌గఢ్‌లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కొందరు ఎస్సీ, ఎస్టీ యువకులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. నకిలీ కుల సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా రాయ్‌పూర్‌లో మంగళవారం నగ్న ప్రదర్శన చేశారు.
వీరు అసెంబ్లీ వైపు ప్రదర్శనగా వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులు నడి రోడ్డుపై నగ్న ప్రదర్శన చేయడం ప్రజలను షాక్‌కు గురిచేసింది.