ఈటానగర్: లైంగిక వేధింపుల కారణంగా ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోగా, సూసైడ్ నోట్లో ఆరోపించిన ఇద్దరు అధికారుల్లో ఒకరు అదే రోజు ఆత్మహత్య చేసుకోవడం అరుణాచల్ ప్రదేశ్లో సంచలనం సృష్టించింది. ఈటానగర్ సమీపంలోని లేఖి గ్రాంలోని నివసిస్తున్న గోమ్చు యేకర్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.
అతడు ఢిల్లీలో పీడబ్ల్యూడీ శాఖలో సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి టాలో పోటోమ్, లిక్వాంగ్ లోవాంగ్ అనే ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. వారి లైంగిక వేధింపులు, తన ద్వారా చేయించిన అవినీతి పనులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు.