అహ్మదాబాద్ : గుజరాత్‌లోని అటవీ ప్రాంతంలో ఓ యువకుడు ట్రాక్టర్‌తో సింహాన్ని వెంబడించాడు. ఈ వీడియో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సింహాన్ని వేటాడినందుకు సదరు యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటల్లోకి పంపినట్లు ఆదివారం ఓ అధికారి తెలిపారు. ఇటీవల అమ్రేలిలోని అటవీ ప్రాంతంలో రోడ్డుపై ఓ యువకుడు తన ట్రాక్టర్‌తో సింహాన్ని వెంబడిస్తూ కనిపించిన వీడియో బయటకు వచ్చింది. ఆ వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి అతని వాహనాన్ని సీజ్ చేసినట్లు అటవీ ప్రాంత ఇన్ఛార్జ్ ఆర్ఏ జింజువాడియా తెలిపారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారి పేర్కొన్నారు. అయితే శనివారం నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే ఆసియాటిక్ సింహాలకు ఏకైక ఆవాసం. గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన 2020 నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ఆసియా సింహాల జనాభా 674, ఇది 2015లో ఉన్న 523 సింహాల జనాభా కంటే 29 శాతం ఎక్కువ.