న్యూఢిల్లీ: టెర్మినల్ (నయం కాని) క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ.. క్యాన్సర్ పరిశోధన కోసం నిధులు సేకరించడంతోపాటు క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు తన జీవితంలోని అత్యంత విలువైన చివరి మూడు నిమిషాల స్లాట్లను లివింగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో వేలం వేసింది. మెల్బోర్న్కు చెందిన 32 ఏండ్ల ఎమిలీ లాహే 2019లో అత్యంత అరుదైన ‘ఎన్యుటీ కార్సినోమా’ అనే క్యాన్సర్ బారిన పడింది. దీంతో ఆమె 9 నెలలకు మించి బతకదని వైద్యులు తేల్చేశారు. అమెరికాలోచికిత్స తీసుకున్న తర్వాత ఆమె జీవితకాలం మరో మూడేండ్లు పెరిగింది. తాజాగా ఆస్ట్రేలియన్ క్యాన్సర్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఏసీఆర్ఎఫ్) ఇన్స్టాలేషన్ ‘టైం టు లివ్’ కార్యక్రమంలో పాల్గొన్నది. వేలంలో భాగంగా ఆమెతో కలిసి మూడు నిమిషాలు మాట్లాడేందుకు అనుమతిస్తారు. దీనివల్ల వారు ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్న వారి మానసిక, భావోద్వేగ జీవితం గురించి తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్తున్నారు.