New Delhi | ఢిల్లీలో వేకువఝామన నడిరోడ్డుపై హత్య.. 40 ఏళ్ల వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన దండగులు
New Delhi : ఢిల్లీలో వేకువ ఝామున నడిరోడ్డుపై కొందరు దుండగులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. ఈ ఘటన ఈస్ట్ ఢిల్లీ, మయూర్ విహార్ ప్రాంతం, అశోక్ నగర్ పరిధిలో ఆదివారం వేకువఝామున ఉదయం 4.00 గంటల సమయంలో జరిగింది.
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. వేకువ ఝామున నడిరోడ్డుపై కొందరు దుండగులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. ఈ ఘటన ఈస్ట్ ఢిల్లీ, మయూర్ విహార్ ప్రాంతం, అశోక్ నగర్ పరిధిలో ఆదివారం వేకువఝామున ఉదయం 4.00 గంటల సమయంలో జరిగింది. అది కూడా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ఎదురుగా ఈ ఘటన జరిగింది.
ప్రత్యక్ష సాక్షి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 ఏళ్ల ఒక వ్యక్తిపై కొందరు దుండగులు కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం జరిగింది. అయితే, పక్కనే ఉన్న నంద్లాల్ అనే గార్డు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ దుండగులు గార్డును కూడా బెదిరించారు. తమకు అడ్డొస్తే అతడిని కూడా చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అతడు దూరంగా ఉండిపోయాడు. ఇక, ఆ వ్యక్తిని కొట్టి చంపిన అనంతరం వారు అక్కడినుంచి పరారయ్యారు.
आख़िर ये दिल्ली में क्या हो रह है !
दिल्ली बनी अपराध की राजधानी !
भाजपा की चार इंजन की सरकार में दिल्ली अपराध की राजधानी बनती जा रही है !
मयूर विहार फेज -3 विधायक कार्यालय के सामने 40 वर्षीय व्यक्ति की पिट पिट कर हत्या कर दी गई है !
लोग में डर का माहौल है ! pic.twitter.com/1mW499jVZA— MLA Kuldeep Kumar (@KuldeepKumarAAP) September 6, 2026
మృతుడి వయసు దాదాపు 40 సంవత్సరాలుగా ఉండగా, అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకు పాల్పడింది ఎవరూ అనే విషయాలు కూడా ఇంకా వెల్లడి కాలేదు. ఈ హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CCTV
- Delhi
- Mayur Vihar
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

