దేశవ్యాప్తంగా నగరాల్లో మొబైల్ ఫోన్ స్నాచింగ్‌లు సర్వసాధారణంగా మారుతున్నాయి, దొంగలు బైక్‌లపై వేగంగా వచ్చి రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్నవారి చేతుల్లోంచి ఫోన్లు లాక్కెళ్తున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఫోన్లో బిజీగా ఉన్న ఓ అమ్మాయికి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను ఓ బైకర్ లాక్కొని వెళ్లిపోయాడు. తీరా ఆ దొంగను పట్టుకున్నాక ఆ అమ్మాయి అతడిని చూసి ఆశ్చర్యపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ‘హైదరాబాద్ మేరేజాన్’ అనే యూజర్ షేర్ చేశారు. ఓ దొంగ బైక్‌పై వచ్చి అమ్మాయి చేతిలో ఫోన్ లాక్కెళ్తాడు. అక్కడే ఉన్న మరో బైకర్ వెంబడించి దొంగను పట్టుకుంటాడు. రోడ్డు పక్కన ఏడుస్తున్న అమ్మాయి వద్దకు ఆ దొంగను తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చాక దొంగను చూసి గట్టిగా అరుస్తుంది. ఇతడు తెలుసా? అని సహాయం చేసి వ్యక్తి అడగ్గా, ‘బాయ్‌ఫ్రెండ్’ అని సమాధానమిస్తుంది. ఇదంతా ఫ్రాంక్ అని తెలుసుకున్న సదరు వ్యక్తి యువతి బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియో 5.5 మిలియన్ల వ్యూస్, 4 లక్షల లైక్స్ సొంతం చేసుకున్నది.